Share News

బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో భారీగా అనుబంధ పరిశ్రమలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:10 AM

రాష్ట్రంలో బీచ్‌శాండ్‌ నుంచి వచ్చే ఖనిజాల ప్రాసెసింగ్‌తో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో భారీగా అనుబంధ పరిశ్రమలు

  • గనుల శాఖపై సీఎం సమీక్షలో అధికారుల వెల్లడి

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీచ్‌శాండ్‌ నుంచి వచ్చే ఖనిజాల ప్రాసెసింగ్‌తో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం టైటానియం స్ట్రాటజిక్‌ మెటీరియల్స్‌ మిషన్‌ను ఏర్పాటు చే యాలని నిర్ణయించింది. మూడు చోట్ల ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈ అనుబంధ పరిశ్రమలతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందనే అంచనా కూడా ఉంది. ఇప్పటికే బీచ్‌శాండ్‌ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అది కోర్టు వివాదాల్లో ఉంది. అయితే మైనింగ్‌ మొదలయ్యాక, బీచ్‌శాండ్‌ మినరల్స్‌ నుంచి సేకరించే అనుబంధ ఖనిజాలను ప్రాసెస్‌చేసి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా టైటానియం స్ట్రాటజిక్‌ మెటీరియల్స్‌ మిషన్‌ పనిచే సేలా త్వరలో విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖను ఆదేశించారు. ఈ నేపఽథ్యంలో మంగళ వారం బీచ్‌శాండ్‌ అనుబంధ రంగాల పరిశ్రమలు, అవకాశాలపై పరిశీలన చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గనులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యద ర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. టైటానిక్‌ స్ట్రాటజిక్‌ మెటీరియల్స్‌ మిషన్‌ ద్వారా వచ్చే పదేళ్లలో 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఈ రంగంలో 40వేలఉద్యోగాలు లభిస్తాయని ముఖ్య కార్యదర్శి ప్రజెంటేషన్‌లో వివరించారు. బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ సందర్భంగా ఇతర ఖనిజాలను ప్రాసెస్‌ చేయడానికి అనేక అనుబంధ పరిశ్రమలు, క్లస్టర్స్‌ వస్తాయని అధికారులు నివేదించారు. శ్రీకాకుళం జిల్లాలో టైటానియం పార్కు, అనకాపల్లి జిల్లాలో రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ కారిడార్‌, మచిలీపట్నంలో ఇంటిగ్రేటెడ్‌ టైటానియం, రేర్‌ఎర్త్‌ మినరల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

Updated Date - Mar 11 , 2026 | 06:10 AM