Share News

భావోద్వేగాల నడుమ చిత్తూరు కౌన్సిల్‌ చివరి సమావేశం

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:36 AM

ఐదేళ్లపాటు కార్పొరేటర్లు. పదవీకాలం మరో వారం రోజులే. ఇది కౌన్సిల్‌లో చివరి సమావేశం. దీంతో అందరిలోనూ భావోద్వేగం. రిజర్వేషన్ల మార్పు.. రాజకీయ సమీకరణాలతో వచ్చే పాలకవర్గంలో తాముంటామో లేదో అన్న సందిగ్ధం. ఇలా మంగళవారం చిత్తూరు నగరపాలక కౌన్సిల్‌ హాలులో మేయర్‌ అముద అధ్యక్షతన జరిగిన చివరి కౌన్సిల్‌ సాధారణ, బడ్జెట్‌ సమావేశం సందర్భంగా అందరిలోనూ చెప్పలేని ఉద్వేగం కనిపించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మాట్లాడుతూ.. అందరూ కలిసి పనిచేస్తేనే చిత్తూరు నగరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధికి కలిసొచ్చే వారిని కలుపుకొని ముందుకెళ్తామన్నారు.

భావోద్వేగాల నడుమ   చిత్తూరు కౌన్సిల్‌ చివరి సమావేశం
చిత్తూరు కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే, సభ్యులు

  • మేయర్‌ అధ్యక్షతన రూ.289.07 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

చిత్తూరు అర్బన్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లపాటు కార్పొరేటర్లు. పదవీకాలం మరో వారం రోజులే. ఇది కౌన్సిల్‌లో చివరి సమావేశం. దీంతో అందరిలోనూ భావోద్వేగం. రిజర్వేషన్ల మార్పు.. రాజకీయ సమీకరణాలతో వచ్చే పాలకవర్గంలో తాముంటామో లేదో అన్న సందిగ్ధం. ఇలా మంగళవారం చిత్తూరు నగరపాలక కౌన్సిల్‌ హాలులో మేయర్‌ అముద అధ్యక్షతన జరిగిన చివరి కౌన్సిల్‌ సాధారణ, బడ్జెట్‌ సమావేశం సందర్భంగా అందరిలోనూ చెప్పలేని ఉద్వేగం కనిపించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మాట్లాడుతూ.. అందరూ కలిసి పనిచేస్తేనే చిత్తూరు నగరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధికి కలిసొచ్చే వారిని కలుపుకొని ముందుకెళ్తామన్నారు. ఇలా చిత్తూరు అభివృద్ధికి తనతో కలిసి వచ్చిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కొందరు సభ్యులను ఆయన అభినందించారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల కష్టాలకు స్పందించి పనిచేయాలన్నారు. కక్షలతో కూడిన రాజకీయం వల్ల అభివృద్ధి జరగదని, వాటికి స్థానం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గత ఐదేళ్లలో నగరాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని మేయర్‌ అముద చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, డిప్యూటీ మేయర్లకు, సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో భాగంగా అజెండా, టేబుల్‌ అజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్‌, రాజే్‌షకుమార్‌రెడ్డి, కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఏసీపీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆమోదించిన అంశాలు

ఫ నగర పరిధిలో రోడ్ల అభివద్ధి.. విస్తరణ.. సిమెంటు రోడ్లు, కాలువలు వంటి పనులు

ఫ గంగినేని పార్కు, ఇతర పార్కుల్లో జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు

ఫ నగరంలోని పలు వీధులకు, రోడ్లకు పేర్లు పెట్టడం

ఇదీ బడ్జెట్‌ లెక్క

నగరపాలక బడ్జెట్‌ రూ.289.07 కోట్లు

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 289.07 కోట్లతో నగరపాలక బడ్జెట్‌ను రూపొందించినట్లు మేయర్‌ అముద తెలిపారు. సాధారణ, మూలధన జమ ద్వారా ఆదాయం ద్వారా రూ.289,07,86,200.. సాధారణ మూలధన వ్యయం రూ.270,78,97000 గా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ప్రారంభ నిల్వ రూ.7.14కోట్లు, ముగింపు నిల్వ రూ. 25కోట్లుగా లెక్కగట్టారు. మొత్తం జమలు రూ.296 కోట్లుగా నిర్ధారించారు. బడ్జెట్‌లో రూ. 25.57 కోట్లు అభివృద్ధి పనులకు కేటాయించగా.. ఇందులో ఎస్సీలకు రూ. 83కోట్లు, ఎస్టీలకు రూ. 1.91 కోట్లు, స్ర్తీ శిశు సంక్షేమానికి రూ.1.27 కోట్లు, విభిన్న ప్రతిభావంతులకు రూ.76 లక్షలు, గుర్తించిన పేదవాడల అభివృద్ధికి రూ.10 కోట్లు చొప్పున కేటాయించారు.

ఈ ఐదేళ్ల కాలంలో మా సహచర సభ్యులను, అధికారులను గట్టి నిలదీసి ఉంటే.. అది కేవలం మా ప్రాంత అభివృద్ధి కోసమే. ఇతర కారణాలు లేవు. ఈ విషయంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి.

- కౌన్సిల్‌లో పలువురు సభ్యుల మాట

Updated Date - Mar 11 , 2026 | 02:36 AM