ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైకోర్టు తీర్పు బాధాకరం..

ABN, Publish Date - Oct 09 , 2025 | 07:15 PM

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంపై కాంగ్రెస్ నేత వీ. హనుమంత రావు స్పందించారు. ఈ మేరకు ఏబీఎన్ తో వీహెచ్ మాట్లాడారు.

హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంపై కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు స్పందించారు. ఈ మేరకు ఏబీఎన్ తో వీహెచ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తమ నోటి దగ్గరి ముద్దను లాక్కున్నాయని మండిపడ్డారు. తారిఖ్ పే తారిఖ్ అని కోర్టు మరో తారిఖ్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున చేయాల్సింది చేశామని చెప్పారు. 'అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో మేం అడ్డుకోలేదు. 56% ఉన్న మేము 42% రిజర్వేషన్లు కావాలని అడిగాం. దానికి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అలోచించి నిర్ణయం చేశారు. దానిపై మేము పోతుంటే మళ్ళీ 4వరకు తీర్పును పొడిగిస్తే ఎలా! న్యాయవ్యవస్థలో కూడా మాకు అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ కరెక్టే అన్నాడు.. న్యాయ వ్యవస్థలో బీసీలు వచ్చే వరకు మాకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటారా?' అని వీహెచ్ ప్రశ్నించారు.

Updated Date - Oct 09 , 2025 | 07:15 PM