తిరుపతిలో చిరుత సంచారం కలలకం
ABN, Publish Date - Feb 06 , 2025 | 12:30 PM
తిరుపతిలోని పలు యూనివర్శిటీల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు బయటకు రావద్దని అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హాస్టళ్లకు నోటీసులు ఇచ్చారు. విద్యార్థులు శబ్దాలు చేసినా అవి పోవడం లేదు. చెట్లపై కూర్చొని జింకలను వేటాడుతున్నాయి.
చిత్తూరు: తిరుపతిలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. పలు యూనివర్శిటీల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో విద్యార్ధులు ఆందోళనకు గురౌతున్నారు. విద్యార్ధులు రాత్రి సమయాల్లో చదువుకుంటారని, అయితే ఇటీవల కాలంలో వారు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. యూనివర్శిటీలో రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు విద్యార్థులు బయటకు రావద్దని అధికారులు ఫ్లెక్సీలు పెట్టి.. హాస్టళ్లకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో చిరుతలు కూడా హాస్టల్స్ వద్దకు వస్తున్నాయి. చిరుతలను చూసిన విద్యార్థులు శబ్దాలు చేసినా వెళ్లడం లేదు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న కుక్కలను వేటాడి తీసుకువెళుతున్నాయి. చెట్లపై కూర్చొని జింకలను వేటాడుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తా: జగన్
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్
నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా: రామకృష్ణ
ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి జిల్లా కలెక్టర్ బస
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 06 , 2025 | 12:30 PM