ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇదే నా కోరిక: సీఎం చంద్రబాబు..

ABN, First Publish Date - 2025-03-30T12:29:31+05:30

ఆనాడు హైటెక్ సిటీ గురించి మాట్లాడానని, నేడు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి తాను చెబుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఉన్న మేధావుల మేధస్సును ఉపయోగించి ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

విజయవాడ: ఆనాడు హైటెక్ సిటీ గురించి మాట్లాడానని, నేడు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి తాను చెబుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఉన్న మేధావుల మేధస్సును ఉపయోగించి ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉగాది పురస్కారాలు-2025 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మనకేమీ తెలియదని అనుకోవాల్సిన అవసరం లేదని, సెల్ ఫోన్‌ను అడిగితే అన్ని విషయాలూ చెబుతుందని పేర్కొన్నారు.


వ్యవసాయం, విద్య, ఇతర అంశాలకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఫోన్‌లోనే దొరుకుతున్నాయని చెప్పారు. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలని, ఆ దిశగా తాము పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి వారు సామాన్యుల నుంచి అసామాన్యులుగా ఎదిగిన వారేనని గుర్తు చేశారు. అందుకే పీ-4 జీరో పావర్టీ అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారతదేశ ప్రజలు ఆదాయంలో ప్రపంచంలోనే నంబర్-1 గా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో 30 శాతం తెలుగువారే ఉండాలనేది తన ఆకాంక్ష అంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Updated Date - 2025-03-30T12:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising