kumaram bheem asifabad-మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:41 PM
మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో బుధవారం సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్ నిర్వాహణకు ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ అర్టీవో లోకేశ్వర్‌రావ్‌తో పాటు కలిసి కలెక్టర్ పరిశీలించారు.
జైనూర్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో బుధవారం సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్ నిర్వాహణకు ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ అర్టీవో లోకేశ్వర్‌రావ్‌తో పాటు కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లాలోని జైనూర్ మండలంలో 26 సర్పంచ్ స్థానాలు, 222 వార్డు సభ్యుల స్థానాలకు తొలి విడతలో భాగంగా ఈ నెల 11న పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఇతర ఎన్నికల సిబ్బంది ఈ నెల 10న ఉదయం 9 గంటలకు పంపిణీ కేంద్రంలో రిపోర్టు చేస్తారని అన్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని కోరారు. షామియానా, కుర్చీలు, టేబుల్లు సరిపడా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంపిణీ కేంద్రంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వాహణ సిబ్బందికి తాగునీరు, అల్పాహారం, భోజన వసతి కల్పించాలని సూచిం చారు. సిబ్బందికి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, తహసీల్దార్ ఆడ బీర్షావ్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు.