ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:35 PM
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
ప్రజావాణికి 132 ఫిర్యాదులు
గద్వాలన్యూటౌన్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ స మావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 132 ఫిర్యాదులు అం దినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో ఎక్కువగా ఇందిరమ్మ గృహాల మంజూరు కొరకు 60 దరఖాస్తులను అర్జీదారులు అందజేశారన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యల ను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు ఉన్నారు.