Share News

Liquor Shops in Villages Operate: ఊరి బయటే మద్యం దుకాణాలు!

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:52 AM

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడి మద్యం వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన...

Liquor Shops in Villages Operate: ఊరి బయటే మద్యం దుకాణాలు!

  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మాత్రమే విక్రయాలు

  • ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సూచనలు పాటించిన దుకాణాల నిర్వాహకులు

నల్లగొండ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడి మద్యం వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రయత్నానికి మద్యం దుకాణాల నిర్వాహకులు మద్దతు ప్రకటించారు. సోమవారం నుంచి ప్రారంభమైన కొత్త మద్యం దుకాణాలను ఎమ్మెల్యే సూచనల మేరకు నడిపేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని 2 మునిసిపాలిటీలు, 7 మండలాల్లో మొత్తం 29 మద్యం దుకాణాలన్నింటినీ గ్రామాల్లో కాకుండా ఊరిబయటే ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకా రం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరిచే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యే సూచనల మేరకు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే తెరుస్తామని, పర్మిట్‌రూములను సాయంత్రం 6తర్వాతే నిర్వహిస్తామని ప్రకటించారు. సోమవారం అదే రీతిలో దుకాణాలను నిర్వహించారు. దుకాణాల వద్ద సిట్టింగులను ఏర్పాటు చేయడం లేదని, బెల్టు దుకాణాలకు కూడా మద్యం సరఫరా చేయబోమని తెలిపారు. తన నియోజకవర్గంలో బెల్టు దుకాణాలను బంద్‌ చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. ఇటీవల జరిగిన మద్యం టెండర్లలోనూ కొత్త దుకాణదారులు విచ్చలవిడి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తే కుదరదని హెచ్చరించారు.

Updated Date - Dec 02 , 2025 | 04:52 AM