గిరిజన తెగువకు చిహ్నం కొమరం భీం
ABN , Publish Date - Oct 22 , 2025 | 10:57 PM
తెలంగాణలో గి రిజనుల పోరాట తెగువకు కొమరం భీం జీవితం చిహ్నంగా నిలిచిందని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గీ తాంజలి అన్నారు.
- ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాంజలి
- జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా కొమరం భీం జయంతి
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో గి రిజనుల పోరాట తెగువకు కొమరం భీం జీవితం చిహ్నంగా నిలిచిందని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గీ తాంజలి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశా లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి నిర్వహించగా, కళాశా ల ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాంజలి, అసి స్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్ కొమరం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళు లు అర్పించారు. వారు మాట్లాడుతూ 1901 అక్టోబరు 22న ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గోండు కుటుంబంలో జన్మించిన కొమరం భీం బాల్యం నుంచి పేదరికం, సామాజిక అన్యా యంతో జీవించారని పేర్కొన్నారు. 1930లో ని జాం పాలనకు వ్యతిరేకంగా జల్, జంగిల్, జమీ న్ అనే నినాదాన్ని ముందుకు నడిపించి గిరిజ నుల పర్యావరణ హక్కులు, భూమి, నీరు, అడ వి పట్ల ఉన్న సంబంధాన్ని తెలిపారన్నారు. కొమరం భీం ఆశయ సాధనకు యువత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ధర్మ, అధ్యాపకులు రవీందర్ నరేష్, మల్లేష్, కృష్ణ, సతీష్, దీపిక, మౌనిక, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు, పట్టణ కార్యదర్శి ప్రసాద్ కుమార్, నాయకులు శివ, మల్లేష్, రమేష్, శివ, భరత్, కీర్తన, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.