Share News

గజ..గజ

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:00 AM

చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చలికాలం ప్రారంభంలోనే చలి తీవ్రమవుతోంది. నవంబరు రెండో వారంలోనే ఇలా ఉంటే డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చలితీవ్రత అధికంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాతావరణం పొడిగా, ఆకాశం నిర్మలంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని, ఉత్తర, ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

గజ..గజ

కరీంనగర్‌ టౌన, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చలికాలం ప్రారంభంలోనే చలి తీవ్రమవుతోంది. నవంబరు రెండో వారంలోనే ఇలా ఉంటే డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చలితీవ్రత అధికంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాతావరణం పొడిగా, ఆకాశం నిర్మలంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని, ఉత్తర, ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికి సాయంత్రం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. కరీంనగర్‌లో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 15కు పడిపోయాయి. వచ్చే వారంరోజులపాటుకనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, దీంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఫ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

చలి తీవ్రత పెరుగుతుండడంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్‌ ఫ్లూ వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భిణులు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలు, 65 సంవత్సరాలుపైన ఉన్న వృద్ధులు, రక్తహీనత, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దంటున్నారు. ప్రతిరోజు ఉదయం కాచి వడబోసిన గోరువెచ్చని నీటిని తీసుకోవడంతోపాటు వేడి ఆహారాన్ని తీసుకోవాలని, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా . ఉదయం కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుండడంతోపాటి చలి తీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం 6 గంటలనుంచి చలి క్రమేపి పెరుగుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాకర్స్‌ ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 6 గంటల వరకు మంచుకురుస్తుండడంతో రాత్రి వేళల్లో రోడ్లపై రద్దీ తగ్గిపోయింది. చలి తీవ్రత పెరుగుతుండడంతో చలిని తట్టకునేందుకు ప్రజలు ఉన్ని దుస్తులను ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఫ ఉన్ని వసా్త్రలకు గిరాకీ

చలి తీవ్రత అధికమవుతుండడంతో ఉన్ని వసా్త్రలకు గిరాకీ పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని పలు చోట్ల వ్యాపారులు ఏర్పాటు చేసిన ఉన్ని వసా్త్రలను నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈయేడాది 10 నుంచి 15 శాతం రేట్లు పెంచి అమ్ముతున్నారని వినియోగదారులు చెబుతున్నారు.

Updated Date - Nov 13 , 2025 | 01:00 AM