Share News

కేసీఆర్‌ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:53 PM

కేసీ ఆర్‌ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్య క్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. మంగళవారం విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి, అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలవేశారు.

కేసీఆర్‌ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ

గోదావరిఖని, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కేసీ ఆర్‌ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్య క్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. మంగళవారం విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి, అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలవేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ ఆమరుల స్దూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ దీక్ష ఫలితం గానే డిసెంబర్‌ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన చేశారన్నారు. మూల విజయరెడ్డి, భాస్కర్‌, శ్రీనివాస్‌, కృష్ణవేణి, విజయ, పాల్గొన్నారు.

పెద్దపల్లి, (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయ డంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం విజయ్‌ దివాస్‌ నిర్వహించారు. అమరవీరుల స్తూ పం వద్ద నివాళుల ర్పించారు. అంబే ద్కర్‌ విగ్రహానికి, అ య్యప్ప టెంపుల్‌ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. మాజీ జడ్పీటీసీ రాములు యాదవ్‌, తిరుపతిరెడ్డి, రాజ్‌కుమార్‌, పాల్గొన్నారు.,

మంథని, (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో విజయ్‌ దివాస్‌ నిర్వహించారు. పాత పెట్రోల్‌ పంపు సమీపంలోని తెలంగాణ తల్లి, స్థానిక ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళుల ర్పించారు.

Updated Date - Dec 09 , 2025 | 11:53 PM