Jupally Krishna Rao: కడెంకు కనీస మరమ్మతులు చేయలేదు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:09 AM
గత ప్రభుత్వ హయాంలో కడెం ప్రాజెక్టుకు కనీసం మరమ్మతులు చేయలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు
మేం వచ్చాక రూ.9 కోట్లు మంజూరు చేశాం: జూపల్లి
ఖానాపూర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో కడెం ప్రాజెక్టుకు కనీసం మరమ్మతులు చేయలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నాటి పాలకుల తీరుతో వరుసగా రెండేళ్లు జలాశయం వద్ద ఆందోళనకర పరిస్థితులను చూశామని తెలిపారు. కడెంకు భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం జూపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు.
అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 9కోట్లు మంజూరు చేశామని తెలిపారు. నేడు ఎంత వరద వచ్చినా గేట్ల ద్వారా సాఫీగా నీరు వెళ్లే పరిస్థితి కల్పించామని చెప్పారు.