Share News

Chang Yo Cho: కొరియా తర్వాత హైదరాబాదే మాకు కీలకం

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:07 AM

దక్షిణ కొరియాలోని తమ ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్‌ తమకు కీలక కేంద్రమని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందయ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ....

 Chang Yo Cho: కొరియా తర్వాత హైదరాబాదే మాకు కీలకం

  • ‘ఆంధ్రజ్యోతి’తో హ్యుందయ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చాంగ్‌ యో చో

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియాలోని తమ ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్‌ తమకు కీలక కేంద్రమని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందయ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చాంగ్‌ యో చో అన్నారు. 30 ఏళ్ల క్రితం చెన్నైలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్లోబల్‌ సమ్మిట్‌ లో భాగంగా తెలంగాణ, కొరియా ఆర్థిక సంబంధాలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా తమకు ఐదు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉండగా.. భారత్‌ కేంద్రం హైదరాబాద్‌లో ఉందని చెప్పారు. ఇందులో 1200 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. అత్యుత్తమ మానవ వనరులు హైదరాబాద్‌ సొంతమని, అందుకే తమ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే విషయంలో కంపెనీ సీరియ్‌సగా ఆలోచిస్తోందన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 04:07 AM