Share News

ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:11 PM

ప్రతీ ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రా ఫిక్‌ నిభందనలు పాటించాలని మంచిర్యాల డీసీపీ బాస్కర్‌ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.

ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
వాహనదారులతో ప్రతిజ్ఞ చేపిస్తున్న డీసీపీ

మంచిర్యాల డీసీపీభాస్కర్‌

లక్షెట్టిపేట, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రా ఫిక్‌ నిభందనలు పాటించాలని మంచిర్యాల డీసీపీ బాస్కర్‌ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మనం నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదా లను చూస్తున్నామని వాటికి కారణం కేవలం చాలా వరకు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించక పోవడమే అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించక ప్రాణాలు వదిలిన వాళ్ల కుటుం బాలు ఎన్నో రోడ్డున పడ్డాయని క్షణం ఆలోచిస్తే మనతో పాటు మన కుటుంబీకులు కూడా సంతోషంగా ఉంటారన్న విషయం ప్రతీ ఒక్కరికి తెలియాలనే పోలీసులు ఇ లాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు పని చేస్తున్నది ప్రజల కోసమని ప్రజలు వాళ్ల కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎలా గైన మార్చాలన్న ఉద్ద్యేశంతో ఎన్నో రకాలుగా రైడ్స్‌ చేసి ఫైన్స్‌ వేసిన కూడా ప్రజల్లో మార్పు రావడం లేదన్నారు. బైక్‌ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్‌ ధరించా లని, కారు డ్రైవింగ్‌ చేసేటప్పుడు సీట్‌ బెల్టు పెట్టుకోవాలని, ఆటోల్లో ఒవర్‌లోడ్‌ ప్యాసిం జర్‌లను ఎక్కించుకోకూడదని అదే విధంగా స్కూల్‌ బస్సులు నడిపే వాళ్లు పిల్లలను జాగ్రత్తగా ఎక్కించుకోవాలని అతి వేగం, రాష్‌ డ్రైవింగ్‌ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడ ద న్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనం నడపకూడదన్నారు. వాహనాల పత్రాలు కలిగి ఉండాలని ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకున్న తర్వాతనే వాహ నాలు నడపాలన్నారు. ముఖ్యంగా తల్లి తండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. అనంతరం వాహనదారులు, డ్రైవర్లతో ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పకుండా పాటి స్తామని ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:11 PM