ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:37 PM
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ సూచించారు.
- ఎస్పీ సంగ్రాంసింగ్ జీ పాటిల్
వెల్దండ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ సూచించారు. మంగళవారం ఎస్పీ వెల్దండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎప్పటికప్పుడు వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతలు సాధ్యపడుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తి, సిబ్బంది ఉన్నారు.
ఎన్నికలకు పటిష్ట భద్రత
వంగూరు, (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎ న్నికల పటిష్ట భద్రత కల్పిస్తామని ఎస్‌పి సం గ్రామ్ సింగ్‌జీపాటిల్ అన్నారు. మంగళవారం వంగూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశా రు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రా మాల్లోని సమస్యాత్మక, అతిసమస్యాత్మక పో లింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ముం దస్తు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ మహేష్ గౌడ్‌ను ఆదేశించారు.
నిరంతర పర్యవేక్షణ ఉండాలి
ఊర్కొండ, (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలపై నిరం తర పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ డాక్టర్ సంగ్రా మ్‌సింగ్ జీ పాటిల్ పోలీసులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టే షన్‌ను ఆయన సందర్శించారు. ఆయన మాట్లా డుతూ స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీ సులు నిరంతరం నిఘా పెంచి శాంతిభద్ర తలను విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసు కోవాలని, గ్రామాల్లో బెల్టుషాపులపై దాడులు చేసి మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటరు కార్డు, ఆధార్‌కార్డు ఉన్న వారిని మాత్రమే అను మతించాలని తెలిపారు. వారి వెంట కల్వకుర్తి సీఐ నాగార్జున ఎస్‌ఐ కృష్ణదేవ ఉన్నారు.
ఫ సమస్యత్మాక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ గా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని కల్వకు ర్తి డీఏస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మం గళవారం మండలంలోని ఊర్కొండపేటలో పో లింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కల్వ కుర్తి సీఐ నాగార్జున, ఎస్‌ఐ కృష్ణదేవ ఉన్నారు.