Telugu Titans Secure First Win: తెలుగు టైటాన్స్ తొలి గెలుపు
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:50 AM
ప్రొ కబడ్డీ లీగ్ 12లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌కు తొలి విజయం దక్కింది. ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ..
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్-12లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌కు తొలి విజయం దక్కింది. ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37-32 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల ఓటమితో పాఠాలు నేర్చుకున్న టైటాన్స్.. ఈ మ్యాచ్‌లో వ్మూహాత్మకంగా ఆడింది. ఆట ప్రారంభం నుంచే టైటాన్స్ ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో ప్రథమార్ధం 16-09 స్కోరుతో ముగిసింది. ద్వితీయార్ధంలో ఒక్కసారిగా పుంజుకున్న పాంథర్స్ వరుస పాయింట్లు రాబట్టి టైటాన్స్‌ను ఆలౌట్ చేసే ప్రయత్నం చేసింది. చివరి నిమిషాల్లో టైటాన్స్ సూపర్ రైడ్స్‌తో పాయింట్లు రాబట్టి సురక్షిత స్థాయికి చేరింది. టైటాన్స్‌లో కెప్టెన్ విజయ్, భరత్ చెరో 8 పాయింట్లు...చేతన్, అజిత్ పవార్ చెరో ఐదు పాయింట్లు రాబట్టి విజయంలో కీలకపాత్ర వహించారు. పింక్ పాంథర్స్ జట్టులో రైడర్ నితిన్ కుమార్ అత్యధికంగా 13 పాయింట్లు సాధించాడు.