Gukesh Wins Opening Round: గుకేష్‌కు గెలుపు
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:37 AM
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీని వరల్డ్ చాంపియన్ గుకేష్ విజయంతో ఆరంభించగా....
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీని వరల్డ్ చాంపియన్ గుకేష్ విజయంతో ఆరంభించగా.. అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానంద తమ గేమ్‌లను డ్రా చేసుకొన్నారు. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో ఫ్రెంచ్ జీఎం ఎటెన్ని బాక్రోట్‌పై గుకేష్ 45 ఎత్తుల్లో గెలిచాడు. స్పెయిన్ జీఎం మాక్సిమ్ చికాగ్‌తో గేమ్‌ను అర్జున్, జెఫ్రీ జియాంగ్ (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకొన్నారు. కాగా మహిళల విభాగంలో మార్సెల్‌తో గేమ్‌ను ద్రోణవల్లి హారిక డ్రా చేసుకుంది.