AP Sports Projects: ఏపీ క్రీడా ప్రాజెక్టులకు 620 కోట్లు మంజూరు చేయండి
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:54 AM
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాప్రాజెక్టుల అభివృద్ధి పనులకు సంబంధించి రూ.620 కోట్ల నిధులు మంజూరు చేయాలని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని...
కేంద్ర ప్రభుత్వానికి శాప్ చైర్మన్ రవినాయుడు విజ్ఞప్తి
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాప్రాజెక్టుల అభివృద్ధి పనులకు సంబంధించి రూ.620 కోట్ల నిధులు మంజూరు చేయాలని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 56 ప్రాజెక్టులను ఖేలో ఇండియా నిధులతో పూర్తి చేయాలని కోరారు. సోమవారం, కేంద్ర క్రీడల శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్‌కృష్ణ రావెళ్లతో ఆయన కార్యాలయంలో రవినాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని ఖేలో ఇండియా ప్రాజెక్టులపై పలు వినతిపత్రాలు అందించారు. విజయవాడలోని ఐజీఎంసీ మైదానాన్ని ఖేలో ఇండియా నిధులతో అభివృద్ధి చేయాలని విన్నవించారు. కాకినాడ డీఎ్‌సఏ, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా రెసిడెన్షియల్ సెంటర్ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అదనంగా డిస్ట్రిక్ లెవెల్ ఖేలో ఇండియా సెంటర్‌లను నిర్మించాలని రవినాయుడు విన్నవించారు. తన విజ్ఞప్తులపై వినీల్‌కృష్ణ సానుకూలంగా స్పందించారని రవినాయుడు మీడియాకు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News