ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్న యువతులు ఎన్నికల్లో సత్తా చాటారు. మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, చింతగూడెం సర్పంచ్ ఎన్నికల బరిలో బీటెక్, బీఈడీ చదివిన యువతులు పోటీ పడ్డారు. వీరిలో బీఈడీ పూర్తి చేసిన సుతారి సుమలత గెలుపొందారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బానోత్ కావేరి 126 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న కావేరి, రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ అయ్యారు. ఆమె తండ్రి గతంలో మూడు సార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఇక, ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థిగా జాదవ్ అనిత 440 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ విజయాలు గ్రామాభివృద్ధిలో యువతరం భాగస్వామ్యాన్ని పెంచుతాయని అందరూ ఆశిస్తున్నారు.