ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో.. హైదరాబాద్ జాతీయ రహదారిపై యువకులు బైక్‌లతో విన్యాసాలు చేస్తూ హాల్ చల్ చేస్తున్నారు. పోటీలు పెట్టుకుని బైక్‌లు వేగంగా నడుపుతూ స్టంట్లు చేస్తున్నారు. దీంతో ఆ రహదారి పై ప్రయాణం చేయాలంటే స్థానికులు వణికిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై నెంబర్ ప్లేట్ కూడా లేకుండా విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.