ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబయి కీపర్ రికెల్టన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. 19వ ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో వైడ్ లైన్లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని పటీదార్ గాల్లోకి లేపాడు. దీంతో వికెట్ కీపర్ రికెల్టన్ వెనక్కి పరుగెడుతూ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.