ఎక్కడైనా సరే ప్రైవేట్ పాఠశాలలంటే సుచీ, శుభ్రతతో పాటు భవనాలు కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామంలోని అక్షర ప్రైవేట్ పాఠశాల పశువుల కొట్టం కన్నా అధ్వానంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రేకుల షెడ్డులో పాఠశాలను నిర్వహించడమే కాకుండా సరైన నీటి వసతి, గదిలో ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేయలేదు. ఇక విద్యార్థులను ఇంటి నుంచి తీసుకువచ్చేందుకు కండిషన్లో లేని టాటాసుమో వాహనం వాడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.