బాపట్ల జిల్లా పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో బెల్ట్ మద్యం దుకాణాలపై మహిళలు దాడి చేసి, మద్యం సీసాలను ధ్వంసం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఏడు బెల్ట్ దుకాణాలను తొలగించేందుకు, గ్రామంలోని మహిళలను ఏకం చేశారు. గ్రామ మహిళల మద్దతుతో.. 7 బెల్ట్ షాపుల్లోని మద్యం సీసాలను ధ్వంసం చేసి, ఇకపై బెల్ట్ షాపులు కొనసాగిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.