కదులుతున్న రైళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించొద్దని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో మార్పు రావట్లేదు. తాజాగా నాగ్పూర్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలులోకి ఓ యువతి పరిగెత్తుకుంటూ ఎక్కేందుకు యత్నించింది. కాలు జారడంతో రైలు-ప్లాట్ఫామ్ మధ్య పడిపోతుండగా అక్కడే ఉన్న రైల్వే పోలీసు ధీరజ్ దలాల్ ఆమెను బయటకు లాగి కాపాడారు. వేగంగా స్పందించి కాపాడిన పోలీసును నెటిజన్లు అభినందిస్తున్నారు.