అక్రమ సంబంధం అంటగట్టి సోషియల్ మీడియా వేదికగా అవమానకరంగా ఫోటోలు పంపుతున్నారని ఓ మహిళ వేధింపులు భరించలేక శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన మహిళ మౌనిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడినట్టు మౌనిక తెలిపింది. ఓ మహిళ తనకు, ఆమె భర్తకు అక్రమ సంబంధం ఉందంటూ తరచూ వేధిస్తోందని.. అనంతపురం వెళ్లిపోయినా వేధింపులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.