రోడ్డుపై కారు నడపడం అనేది ఒక బాధ్యతాయుతమైన పని. ఎందుకంటే, కాస్త ఎటమటం అయినా మీ జీవితం మాత్రమే కాదు, ఇతరుల జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా మైనర్ల చేతికి బైక్లు, కార్లు ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఆటు పోలీసుల హెచ్చరికలు, ఇటు పెద్దల మాట పెడిచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన మైనర్లు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వారి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు.. ఇతర ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తారు. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో ఆనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో భయంకరంగా ఉంది.