విశాఖలోని పుణ్యక్షేత్రం సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసాదం చుట్టూ ఇప్పుడు వివాదం నెలకొంది. ఈ నెల 29న స్వామివారిని దర్శించుకున్న ఒక భక్తుడు, తాను కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదం ప్యాకెట్లో నత్త వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. భక్తులు ప్రసాదం తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటూ అతను చేసిన ప్రచారం నెట్టింట వైరల్ కావడంతో దేవస్థానం అధికారులు తీవ్రంగా స్పందించారు. స్వామివారి ప్రసాదం తయారీలో అత్యంత శుభ్రత పాటిస్తామని, పులిహోరలో నత్త పడే అవకాశమే లేదని స్పష్టం చేసిన అధికారులు...కావాలనే ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.