పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓసిపి ప్రాజెక్టు లో పెద్దపులి సంచారంతో సమీప గ్రామప్రజలు హడలెత్తిపోతున్నారు. రెండురోజులుగా ప్రాజెక్ట్ లోని దట్టమైన అడవిలో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్దపులి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నుంచి గోదావరి నది దాటి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌కు వచ్చింది. ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామాలైన మల్కాపూర్, మేడిపల్లి, లింగాపూర్, గంగానగర్, జనగాం గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరం జోన్ ఫారెస్ట్ ఛీప్ కన్జ్వరేటర్ ప్రభాకర్, జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్యలు పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు.