సుమారు 60 కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వార్‌కు దిగిన ఘటన పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాపసింగారంలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం సింగారం ప్రధాన కూడలిలో ఈ మేరకు కోతులు బీభత్సం సృష్టించాయి. స్థానికులు వాటిని చెదరగొట్టడంతో శాంతించాయి. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేసినా, వారు పట్టించుకోవడం లేదని నివాసితులు ఫైరవుతున్నారు.