యానాంలో ఓ పోక్సో కేసులో నిందితున్ని పాండిచ్చేరి కోర్టుకి తీసుకెళ్లి తిరిగి యానాంకి తిరిగి తీసుకొస్తున్న సమయంలో సీఐ అడలారసన్ డ్యాన్స్‌లు చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సీఐ మద్యం, కల్లు సేవించి పోలీస్ వ్యాన్స్‌లో డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆ సమయంలో వాహనంలో పలువురు అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారని సీఐ తెలిపారు. తాము తాగింది కేవలం మజ్జిగ మాత్రమేనని.. కల్లు కాదని స్పష్టం చేశారు.