ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినిలను వైస్ ప్రిన్సిపల్ చితకబాదాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలను వాష్ రూమ్‌కి వెళ్లారన్న కారణంతో కరెంట్ వైర్‌తో వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి కొట్టారు. దీంతో ఇద్దరు విద్యార్ధినిలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరు విద్యార్ధినిలను ఆటోలో ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు.