టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన సిరీస్లో నాలుగు మ్యాచుల్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి తన అద్భుత ప్రదర్శనను చాటాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్(2025)లో 36 వికెట్లు తీసి, ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్-1 స్థానంలో ఉన్న వరుణ్. 818 రేటింగ్ పాయింట్లతో బుమ్రా రికార్డును కూడా అధిగమించాడు.