యెమెన్ హౌతీ రెబల్స్‌పై అమెరికా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సాదా గవర్నరేట్స్‌లోని ఆఫ్రికన్ మైగ్రెంట్స్ ఉండే జైలుపై అమెరికా వైమానిక దాడి చేసిందని హౌతీలు ఆరోపిస్తున్నారు. జైలులో 100 మంది వరకు ఖైదీలు ఉండగా.. తొలుత 30 మంది చనిపోయారని తెలిపారు. మృతుల సంఖ్య 68కి చేరినట్లు చెప్పారు. అయితే, ఈ దాడికి సంబంధించి అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు రాజధాని సనాలో జరిగిన దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.