వరంగల్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లపై మందుబాబుల దాడులు ఆగడం లేదు. తాజాగా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ పై మందు బాబుల వీరంగం చేశారు. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్‌పై కొంతమంది యువకులు దాడి చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బంధువులమంటూ హంగామా సృష్టించారు. డ్రైవర్ పక్కనే ఉన్న గేర్ బాక్స్ పై కూర్చొని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. దీంతో డ్రైవర్‌పై దాడి చేసిన మందు బాబులను ప్రయాణికులు పోలీసులకు ఆప్పగించారు.