కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వీణవంక మండలం ఎల్బాక నుండి నాగారం గ్రామానికి పత్తి ఏరడానికి మహిళా వ్యవసాయ కూలీలు వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురికి తీవ్ర గాయాల కావడంతో 108వాహనంలో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.