పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరోసారి రెచ్చిపోయింది. సింధ్-బలూచిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సుల్తాన్‌కోట్ వద్ద రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి పేల్చింది. క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఈ దాడికి గురై ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.