తమిళనాడులోని కరూర్ కార్పొరేషన్ 15వ వార్డులో శిథిలావస్థకు చేరిన ఒక వాటర్ ట్యాంకును కూల్చివేస్తుండగా ఘోరప్రమాదం జరిగింది. కూల్చివేత సమయంలో ట్యాంక్ ఒక్కసారిగా పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జరిగిన ఆస్తి నష్టానికి కార్పొరేషన్ అధికారులు తక్షణమే పరిహారం చెల్లించాలని బాధితుడు డిమాండ్ చేశారు.