ఢిల్లీలోని పహార్గంజ్లో ఓ కారు డ్రైవర్‌పై ట్రాఫిక్ పోలీస్ పాశవికంగా దాడి చేశారు. సరైన డాక్యూమెంట్స్ లేని కారణంతో కారులోకి ప్రవేశించి మరీ పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన జరుగుతుండగా బయట నుంచి పలువురు వీడియో తీశారు. వారిని గమనించిన తరువాత దాడి చేయడం ఆపారు. ఇది SMలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగమని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.