హిమాచల్ ప్రదేశ్లో ఈసారి ఆశించిన స్థాయిలో మంచు కురవకపోవడంతో పర్యాటక రంగం కుదేలవుతోంది. లాహౌల్ లోయ, మనాలి వంటి ప్రాంతాలకు వచ్చే టూరిస్టులను ఆకట్టుకోవడానికి స్థానిక వ్యాపారులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఎత్తైన పర్వత ప్రాంతాల నుండి జీపుల్లో మంచును తరలించి, టూరిస్ట్ స్పాట్లలో పరుస్తున్నారు. ఇది చూసిన పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కనుమరుగవుతుండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.