ఒడిశాలోని చిలికా సరస్సులో టోర్నడో వంటి దృశ్యం ఆవిష్కృతమైంది. దీంతో సరస్సును సందర్శించేందుకు వెళ్లిన పర్యాటకులు ఆశ్చర్యంతో పాటు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వీడియో వైరలవ్వగా దీనిని వాటర్ స్పౌట్గా వాతావరణ నిపుణులు గుర్తించారు. విశాలమైన నీటి ఉపరితలాలు, సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే ఒక వాతావ స్థితి అని తెలిపారు.