నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుంచి విముక్తి కల్పించేందుకు.. ఆ గ్రామ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కుమ్మరి రంజిత్.. చింపాంజీ దుస్తువులు తెప్పించుకొని.. వాటిని ధరించారు. దీంతో చింపాంజీ వేషధారణంలో ఉన్న సర్పంచ్‌ను చూసి కోతులు పరారయ్యాయి. గ్రామాల్లో కోతుల బెడదని అరికట్టేందుకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన కోరుతున్నారు. కోతులను తరిమేందుకు నూతన సర్పంచ్ చేసిన ఆలోచనపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.