దిత్వా తుపాన్ నేపథ్యంలో తిరుమల కొండలు ప్రకృతి శోభాయమానంగా మారాయి. దేశం నలువైపులా నుండి తిరుపతి తిరుమల వచ్చే పర్యాటకులను మాల్వాడి గుండం జలపాతం హోరుతో స్వాగతం పలుకుతోది. దిత్వా ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు మాల్వాడి గుండం జలపాతం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. ఎత్తైన తిరుమల కొండలు.. చుట్టూ పచ్చటి చెట్లు.. మధ్యలో పాలధార ప్రవాహంలా మాల్వాడి గుండం వద్ద జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు ఆ సోయగాలు చూసేందుకు.. వాటిని తమ కెమెరాల్లో బంధించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మాల్వాడి గుండం జలపాతం హోరుగా ప్రవహిస్తున్న దృశ్యాలు మీకోసం...