పని భారం పెంచుతూ.. తమను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట టిమ్స్ సర్వీసు డ్రైవర్లు నిరసనకు దిగారు. రెండురోజుల పనిదినాన్ని ఒక్కరోజు కుదించటం వల్ల త్రీవ ఇబ్బందులు పడుతున్నామని స్పెషల్ ఆఫ్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా టిమ్స్ సర్వీసులపై పనిచేస్తున్నామని ఇప్పుడు రెండురోజుల పనిదినాన్ని తీసివేయడం వల్ల తాము పనిచేయలేకపోతున్నామన్నారు.