ఏఐ సహాయంతో పెద్ద పులి సంచారం అంటూ ఫేక్ ఫోటో వైరల్ చేసిన వ్యక్తిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సీసీసీ టౌన్ షిప్‌కు చెందిన కారు డ్రైవర్ సాయి కిరణ్ ఆ ఏరియాలో పులి తిరుగుతున్నట్లు ఫోటోలు క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. దీంతో కాలనీలోకి పులి వచ్చిందని స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా అటవీ శాఖ అధికారులు.. స్థానికంగా పులి జాడల కోసం అన్వేషించినప్పటికీ.. పులి తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఆ ఫోటోపై దృష్టి సారించిన అధికారులు.. సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ క్రమంలోన తానే ఆ ఫోటోను సృష్టించినట్లు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు.