సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏటీఎం చోరీకి జరిగిన విఫలయత్నం స్థానికంగా కలకలం రేపింది. ఆల్విన్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం మెషిన్‌ను తెరిచేందుకు లోపల ఉన్న కేబుళ్లను దుండగులు తగులబెట్టారు. అయితే అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బ్లూకోట్ సిబ్బందిని గమనించిన దొంగలు, భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమయానికి పోలీసులు రావడంతో ఏటీఎంలోని నగదు సురక్షితంగా మిగిలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.