అఫ్గానిస్థాన్‌లో ఓ ఇండియన్ మోటో బ్లాగర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తనిఖీలో భాగంగా చెకోపోస్ట్ వద్ద తాలిబన్లు అతడిని ఆపారు. అయితే తనది భారతదేశమని చెప్పగానే తాలిబన్ సైనికులు చిరునవ్వుతో అతడికి వెల్కమ్ చెప్పి ఛాయ్ ఆఫర్ చేశారు. కనీసం పాస్‌పోర్ట్ కూడా తనిఖీ చేయకుండానే పంపించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు అద్దం పట్టింది.