ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దొంగలు చోరీకి యత్నించారు. నారాయణ ఏజెన్సీ, టెక్సమో మోటార్స్ దుకాణాల్లో చోరీ చేసేందుకు ప్రయత్నించారు. షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు కౌంటర్ లో ఉన్న 3వేల రూపాయలను దోచుకువెళ్లారు. అయితే విలువైన వస్తువులు, నగదు పెద్దగా దొరకకపోవడంతో దొంగలు వెనుతిరిగి వెళ్ళిపోయినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దుకాణదారులు ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దొంగను గుర్తించేందుకు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.