పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. జోష్యుల వారి వీధి, సిద్ధని వారి వీధుల్లో పలు కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి.. వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఆదివారం రాత్రి.. తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. ఉదయాన్నే తలుపులు తీసి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు.