శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినా మంచు ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ముందున్న వస్తువులు, మనుషులు కనిపించక లైట్లు వేసుకుని జాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు. మనిషి దగ్గరికి వచ్చేవరకు కనిపించని పరిస్థితి ఉంది. వాకింగ్‌కు వెళ్లేవారు చలికి ఇబ్బంది పడుతూనే వాకింగ్ చేస్తున్నారు. అయితే, ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి యువకులు తమ సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.