రంగారెడ్డి జిల్లా కోనాపూర్ గ్రామంలో రిజర్వేషన్ల కారణంగా ఒకే ఎస్టీ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలకు సర్పంచ్ పదవి చేపట్టే అరుదైన అవకాశం వచ్చింది. గతంలో అత్త రాములమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఇప్పుడు కోడలు శ్రీలత కూడా అదే విధంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఈ గ్రామంలో ఒక్కటే ఎస్టీ కుటుంబం ఉండగా.. ఆ కుటుంబంలో కూడా ఇద్దరు మహిళా ఓటర్లే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచి స్థానం ఎస్టీకి రిజర్వు అయ్యింది. దీంతో ఆ కుటుంబానికి అదృష్టం వరించింది. గతంలో ఓ సారీ ఇలానే.. ఎస్టీ కోటాలో ఇదే కుటుంబం నుంచి రాములమ్మ సర్పంచ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కోడలు శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది.